
ఏన్కూర్ పీహెచ్‌సీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు..
అనారోగ్యంతో బాధపడుతున్న ఆశా వర్కర్‌కు ఆర్థిక సాయం
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 16 2026: ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం నాచారం ఆరోగ్య ఉపకేంద్ర పరిధిలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ బానోతు విజయ ఇటీవల రెండు కిడ్నీలు దెబ్బతినడంతో అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న పీహెచ్‌సీ సిబ్బంది మానవతా దృక్పథంతో స్పందించారు. డాక్టర్ బాలకృష్ణ సహకారంతో వైద్య సిబ్బంది కలిసి విజయకు రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న సహచర ఉద్యోగికి సిబ్బంది మంచి మనసుతో అండగా నిలవడం అభినందనీయమన్నారు. సహాయానికి ముందుకొచ్చిన వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సేవా భావంతో ఒకరికొకరు అండగా నిలవడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.




