PoliticalTelangana

మా గెలుపులో కవిత పాత్ర లేదు.. AIFB నేత షాకింగ్ కామెంట్స్

మా గెలుపులో కవిత పాత్ర లేదు.. AIFB నేత షాకింగ్ కామెంట్స్

మా గెలుపులో కవిత పాత్ర లేదు.. AIFB నేత షాకింగ్ కామెంట్స్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కవిత మద్దతుదారులు ఏకంగా ఓ మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకోవడం సంచలనంగా మారింది.

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత మద్దతు ఇచ్చిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. మత్తం 10 వార్డులకు గాను 8 చోట్ల సింహం గుర్తుపై గెలిచి సత్తా చాటారు.

దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కవిత వ్యూహంపై స్టేట్ వైజ్ గా చర్చ జరుగుతున్న వేళ జాగృతి అధ్యక్షురాలికి బిగ్ షాక్ తగిలింది. కవితకి మాకు సంబంధం లేదు లేదని AIFB పార్టీ నుంచి గెలుపొందిన వడ్డేపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆమెతో మేము మాట్లాడింది లేదు : ఏఐఎఫ్‍బీ నేత వడ్డేపల్లి శ్రీనివాస్ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడుతూ.. మాకు జాగృతికి సంబంధం లేదన్నారు.

AIFB పార్టీ నుండి బీఫాం తీసుకోవడానికి వెళ్ళినపుడు కవిత జాగృతి కండువా మాకు కప్పిందని కానీ ఆమె మాకు ప్రచారానికి వచ్చింది లేదు, ప్రచారంలో ఆమె కండువా మేము వేసుకున్నది లేదని, ఆరోజు తరువాత ఆమెతో మేము మాట్లాడింది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా వడ్డేపల్లిలో మొత్తం 10 వార్డులు ఉండగా ఇందులో 8 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విజయం సాధించగా చెరొ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలుపొందాయి.

గెలుపు సంబరం గంటల్లోనే మాయం : రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతానని శపథం చేసిన కవిత తన పార్టీ ఇంకా సిద్ధంగా లేకపోవడంతో ఏఐఎఫ్ బీ పార్టీకి మద్దతు తెలిపింది.

ఈ నేపథ్యంలో ఇవాళ వచ్చిన ఫలితాల్లో ఏకంగా ఈ పార్టీ ఓ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం సంచలనంగా మారింది.

ఈ గెలుపుతో జాగృతి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఇంతలో తమ పార్టీ గెలుపుకు కవితకు ఎలాంటి సంబంధం లేదని వడ్డేపల్లి శ్రీనివాస్ ప్లేట్ ఫిరాయించడం హాట్ టాపిక్ గా మరాంది.

ఈ పరిణామాలతో కవితకు గెలుపు సంబరం కాస్త గంటల వ్యవధిలోనే చేదుగా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఈ గెలుపు వెనుక ఎవరి కృషి ఉంది, ఈ పరిణామాలపై కవిత ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button