PoliticalTelangana

పంచాయతీ కార్యదర్శులకు బిగ్ రిలీఫ్...

పంచాయతీ కార్యదర్శులకు బిగ్ రిలీఫ్...

పంచాయతీ కార్యదర్శులకు బిగ్ రిలీఫ్…

అంతర్ జిల్లాల డిప్యూటేషన్లకు అనుమతులు

పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవో నంబర్ 317 కార ణంగా స్థానికత కోల్పోయి దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న 223 మంది పంచాయతీ కార్యదర్శులకు రెం డేళ్ల పాటు అంతర్ జిల్లా డిప్యూటేషన్పై నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వెనుక పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కీలక పాత్ర పోషించారు.

జీవో 317 వల్ల జరిగిన నష్టాలను సరిది ద్దేందుకు కేబినెట్ సబ్ కమిటీ సి ఫార్సుల మేరకు ప్రభుత్వం జీవో 190 జారీ చేసింది. ఆ నిర్ణయానికి అనుగుణం గా అంతర్ జిల్లా డిప్యూటేషన్ ప్రక్రియను ప్రారంభించిన తొలి శాఖగా పంచాయ తీ రాజ్ శాఖ నిలవడం మంత్రి సీతక్క కృషికి నిదర్శనం.

ఈ సందర్భంగా మం త్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను సరిదిద్దుతూ, పారదర్శ కంగా ముందుకు సాగుతున్నామని తెలి పారు. ఈ నిర్ణయంపై రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభు త్వం, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button