HyderabadPoliticalTelangana

హైదరాబాద్‌లో దా*రుణం.. బాలికపై ముగ్గురు సామూహిక అత్యా*చారం..

హైదరాబాద్‌లో దా*రుణం.. బాలికపై ముగ్గురు సామూహిక అత్యా*చారం..

హైదరాబాద్‌లో దా*రుణం.. బాలికపై ముగ్గురు సామూహిక అత్యా*చారం..

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్‌కు గురైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మాయమాటలతో బాలికను నమ్మించి, మత్తు పదార్థాలు ఇచ్చి ముగ్గురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఈ కేసులో పోలీసులు నిందితులను గుర్తించి కటకటాల్లోకి నెట్టారు.

పుప్పాలగూడా పాషా కాలనీకి చెందిన మైనర్ బాలిక మూడు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సిసిటీవీ ఫుటేజ్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోహెల్ అనే యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించాడు.

ఆమెను తనతో పాటు ఘట్‌కేసర్ సమీపంలోని రాంపూర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ సోహెల్ తన స్నేహితులైన అర్బాజ్, ఇమ్రాన్‌లతో కలిశాడు. నిందితులు ముగ్గురూ కలిసి బాలికకు బలవంతంగా మత్తు పదార్థం ఇచ్చారు.

ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ముగ్గురూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఆచూకీ కనుగొన్న పోలీసులు ఆమెను రక్షించి వివరాలు సేకరించారు.

జరిగిన దారుణాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రధాన నిందితుడు సోహెల్‌తో పాటు అతనికి సహకరించిన అర్బాజ్, ఇమ్రాన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులపై పోక్సో (POCSO) చట్టం మరియు గ్యాంగ్‌రేప్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోలీసుల సంరక్షణలో ఉంది.

ఘటన జరిగిన ప్రాంతంలో ఆధారాల సేకరణ కోసం క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button