
ఉరివేసుకుని యువకుడి మృ*తి..
కొల్లాపూర్: మండల పరిధిలోని మొలచింతపల్లిలో చాకలి చిన్నయ్య కుమారుడు సాకలి సాయి (23) ఆదివారం రాత్రి వారి సొంత ఇంటిలోనే చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో నిచ్చెన పైకి ఎక్కి మిద్దె పైకప్పు ఉన్న ప్యాన్ కొక్కేని చీరను బలంగా కట్టి ఆ పై గొంతుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారం ఉదయం తన మిత్రులకు సాయి కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లి కిటికిలో నుంచి చూశారు. వెంటనే షాక్ కు గురైన మిత్రులు చుట్టు పక్కల ఇళ్ల వారికి సమాచారం ఇవ్వడంతో జనం తరలివచ్చి చూసి వెళ్ళారు.
మృతికి గల కారణాలు ఏమిటన్నది తెలియాల్సి ఉంది. మృతుడి తల్లిదండ్రులు చాకలి చిన్నయ్య, కళావతి గద్వాల ప్రాంతానికి వలస కూలీలుగా వెళ్లినట్లు ఆ గ్రామస్థులు చెప్పారు.




