
నా తండ్రి తప్పు చేస్తే.. నన్ను తిడుతూ ఎందుకు కామెంట్స్ పెడుతున్నారు.. మాచర్ల ఏఎస్సై కూతురు
Web desc : ఏపీలో పల్నాడు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లోని పార్కుల్లో ఏకాంతంగా గడుపుతున్న జంటలను మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్ రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఏఎస్సై దందాకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే నిందితుడైన ఏఎస్ఐ శ్రీనివాస్ చేసిన తప్పుకు అతని కూతురు, యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్ నందిని ట్రోల్స్ రౌండప్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నా తండ్రి తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి కానీ నా వీడియోల కింద నన్ను తిడుతూ కామెంట్లు ఎందుకు పెడుతున్నారంటూ నందిని వాపోయింది. ఈ మేరేకు నందినీ ఓ వీడియోను షేర్ చేసింది.
నేను డ్రోన్‌తో ప్రేమ జంటల వీడియోలు తీసి మా నాన్నకు ఇచ్చినట్లు ప్రూఫ్స్ ఉన్నాయా..? ఉంటే అవి తీసుకొని నా దగ్గరికి రండని కామెంట్స్ పెడుతున్న వారిని సవాలు విసిరింది.
యూట్యూబ్‌లో తన వీడియోల కింద అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన నందిని తన వీడియోల కింద తిడుతూ కామెంట్లు పెడుతున్న ఎవ్వరిని వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చింది.
ఏఎస్సై శ్రీనివాస్ మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రేమికులు, కళాశాల విద్యార్థులే లక్ష్యంగా దందాలకు పాల్పడుతున్నాడు.
జమ్మలమడుగుకు చెందిన ఓ ఆటోడ్రైవర్‌తో జంటలు సన్నిహితంగా ఉన్న వీడియోలు తీయించి, వారిని స్టేషన్‌కు తీసుకెళ్తానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వలేని యువతులను తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధిస్తున్నట్లు కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.



