KarimnagarPoliticalTelangana

మంత్రి శ్రీధర్ బాబు కి కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్

మంత్రి శ్రీధర్ బాబు కి కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్

మంత్రి శ్రీధర్ బాబు కి కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్

Web desc : మంత్రి శ్రీధర్ బాబును వెంటపడి మళ్లీ ఓడిస్తామని తెలంగాణ రక్షణ సమితి చీఫ్ కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ సింగరేణి ‘బాయిబాట’ కార్యక్రమం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర రాజకీయ వేడిని రగిల్చింది.

ఇందులో భాగంగా ఆమె ఇవాళ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు (ALP) మైన్‌ను సందర్శించారు. అండర్‌గ్రౌండ్ మైన్‌లోకి వెళ్లి కార్మికులతో ముఖాముఖి మాట్లాడి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ కార్మికుడు తను పడుతున్న కష్టాలను, ఇబ్బందులను వివరిస్తుండగా కవిత తీవ్ర చలించిపోయారు.

కార్మికుడి బాధలు విని ఆమె కంటతడి పెడుతూ తాము తోడుగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రి శ్రీధర్ బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఉత్తర తెలంగాణకు అన్నం పెట్టే సింగరేణి సంస్థకు ప్రస్తుత ప్రభుత్వమే విద్రోహిగా మారిందని అన్నారు. ప్రభుత్వం సింగరేణికి దాదాపు రూ.50 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని అన్నారు.

నేటికీ బ్రిటిష్ సిస్టమ్ నడుస్తోంది.. సింగరేణిలో ప్రొడక్షన్ టార్గెట్లు పెంచుతున్న ఆఫీసర్లు, కార్మికులకు కనీస సౌకర్యాలు, సరైన పనిముట్లు కల్పించడం లేదని కవిత ఆరోపించారు.

అండర్‌గ్రౌండ్ మైనింగ్‌లో మెషినరీని అప్‌గ్రేడ్ చేయడం లేదన్నారు. మ్యాన్ చైర్ మీద 45 నిమిషాల పాటు ప్రయాణించడం వల్ల కార్మికులకు వెన్నునొప్పి వస్తోందని.. వాటికి ప్రత్యామ్నాయాలు చూపాలని డిమాండ్ చేశారు.

సింగరేణిలో ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ నడుస్తోందని, ఆఫీసర్లు కార్మికులను వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. జేఎంఐటీ (JMIT)లో ఉన్న వారికి తొమ్మిదేళ్లయినా ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. కార్మికులు, ఆఫీసర్లు రెండు కళ్లలా పనిచేయాలి కానీ, ఒకరిని అణచివేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

శ్రీధర్ బాబు.. మధ్యలోకి వస్తే ఖబడ్దార్! మంత్రి శ్రీధర్ బాబును టార్గెట్ చేస్తూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కొమురం భీమ్ విగ్రహావిష్కరణ సమయంలో నాతో పాటు ఆయన మనవడిని అరెస్ట్ చేయించారని అన్నారు.

నాడు ఆయన చేసిన తప్పుకు తాము వెంటబడి మరీ ఎన్నికల్లో ఓడించామని, మళ్లీ ఇప్పుడు కార్మికులకు, మాకు మధ్య రావాలని చూస్తే ఖబద్దార్! మళ్లీ వెంటబడి మరీ ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తమను కార్మికులను కలవనీయకుండా 4 రోజులుగా పోలీసులు పెట్టి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

అసలు సింగరేణిలోకి పోలీసులకు అనుమతే లేదని.. తాను వస్తున్నానని గేట్ మీటింగ్‌కు వస్తే జీతాలు కట్ చేస్తామని బెదిరించారట అంటూ కామెంట్ చేశారు. కార్మికుల జీతం కట్ చేస్తే తాను ఇక్కడే ధర్నాకు కూర్చుంటానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో హెచ్ఎంఎస్ (HMS)ను గెలిపించాలని, కార్మికులు కాలర్ ఎగిరేసుకునేలా తాము అండగా ఉంటామని కవిత పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button