HyderabadPoliticalsuryapetaTelangana

కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం.. బీఆర్ఎస్‍లో చేరికపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం.. బీఆర్ఎస్‍లో చేరికపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం.. బీఆర్ఎస్‍లో చేరికపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

web desc : తాజా పరిణామాలతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ భవిష్యత్ కార్యాచరణపై జోరుగా చర్చ జరుగుతోంది. ఆమె కాంగ్రెస్‍లోనే కొనసాగుతారా లేక హస్తానికి హ్యాండ్ ఇచ్చి మరో పార్టీలో చేరుతారా అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కొండా సురేఖ కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీలో చేరేందుకు ఆయా పార్టీలతో చర్చలు జరుపుతున్నారనే ప్రచారం వేళ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కొండా సురేఖ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం : శుక్రవారం మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన జగదీశ్ రెడ్డి.. కొండా సురేఖను మళ్లీ బీఆర్ఎస్ చేరుతారనే ప్రచారాన్ని ప్రచారాన్ని ఖండించారు.

కొండా సురేఖను బీఆర్ఎస్‌లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వంమని ఆమెను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమని స్పష్టం చేశారు. పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారందరినీ తిరిగి చేర్చుకునే ప్రసక్తి లేదని, పార్టీ మారిన వారిలో కేవలం ఒకరిద్దరిని తప్ప మిగతా ఎవరినీ మళ్లీ బీఆర్ఎస్‌లోకి రానిచ్చేది లేదని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని జగదీశ్ రెడ్డి బాంబు పేల్చారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే అమ్ముడుపోయినట్టే : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూడా జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి అసలు తీసుకోమన్నారు. ఆయనకు ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కార్ మంత్రి పదవి ఇస్తే.. అది పూర్తిగా అమ్ముడుపోయినట్టే లెక్క అని వ్యాఖ్యానించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు తమ పార్టీ పూర్తి వ్యూహాలతో సిద్ధంగా ఉందని జగదీశ్ రెడ్డి వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button