HanumakondaPoliticalTelangana

ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మ*హత్య..

ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మ*హత్య..

ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మ*హత్య..

Web desc : ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ముస్త్యాల పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.

ఎస్సై ఇమ్మడి వీరభద్ర రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కట్ట స్నేహ (22) పీజీ పూర్తిచేసి కొంతకాలంగా ఇంటివద్ద ఉంటుంది. ఇదే గ్రామానికి చెందిన జీడిమెట్ల శ్రీధర్‌ కొంతకాలంగా ఆ యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు.

తనను పెళ్లిచేసుకోవాలని, లేని పక్షంలో తనతో వాట్సాప్‌లో చేసిన చాటింగ్‌ బంధువులకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం యువతి తన తల్లిదండ్రులకు తెలపగా శ్రీధర్‌ను పెద్దమనుషుల సమక్షంలో మందలించారు. అయినప్పటికి మరో నంబర్‌ నుంచి ఫోన్‌ చేస్తూ తననే పెళ్లి చేసుకోవాలని, లేని పక్షంలో చంపుతానని బెదిరించాడు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి శుక్రవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని బావిలోదూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై సంఘటనస్థలానికి చేరుకొని, మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button