suryapeta
Trending

ఆరుగురు గురుకుల విద్యార్థులు అదృశ్యం

ఆరుగురు గురుకుల విద్యార్థులు అదృశ్యం

ఆరుగురు గురుకుల విద్యార్థులు అదృశ్యం..

  • ఫిర్యాదు చేసిన 24 గంటల్లో చెదించిన కోదాడ రూరల్ పోలీసులు
  • విచారణ చేపడుతున్న ఎస్ఐ అనిల్ రెడ్డి

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట ఆవాస గ్రామమైన నెమలిపురి ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో.. ఆరుగురు విద్యార్థులు ఆదివారం నుంచి కనిపించకపోవడంపై… గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ ఘటనపై స్పందించిన కోదాడ రూరల్ పోలీసులు 24 గంటల్లోనే ఈ మిస్సింగ్ కేసును చేదించి తల్లి తండ్రుల కళ్ళల్లో ఆనందం నింపారు. శనివారం రాత్రి 10 వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ నిర్వహించగా వారిలో కొంత మంది విద్యార్థులు మద్యం సేవించి గొడవ పడ్డారని, ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ మందలించారని దీంతో మనస్థాపనికి గురైన విద్యార్థులు కనిపించకుండా పోయారని సహా విద్యార్థులు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో స్కూల్ ఆవరణలోకి మద్యం ఎలా వచ్చింది అనే విషయంపై గురుకుల స్కూల్లో జరుగుతున్న పలు సంఘటనలపై విచారణ చేస్తున్నామని కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button