PoliticalTelangana

ద్విచక్ర వాహనాలు ఢీ ఒకరు మృతి…

ద్విచక్ర వాహనాలు ఢీ ఒకరు మృతి…

ద్విచక్ర వాహనాలు ఢీ ఒకరు మృతి…

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) జనవరి 16

ఆలేరు మండలం గోలనుకొండ గ్రామం కుమ్మరి కుంట మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఒకటి ఒకటి ఢీకొట్టడం తో ఒకరు మృతి చెంది మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆలేరు సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ ఐ) వెంకట శ్రీను తెలిపిన వివరాల ప్రకారం… యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన సీస మహేష్ (30 సం!!) సోమవారం మధ్యాహ్నం సమయంలో తన అత్త వారిల్లు అయినటువంటి గొలనుకొండ గ్రామానికి పండుగకు వచ్చి వెళ్తున్న తరుణంలో గ్రామ సమీపంలో ఉన్నటువంటి కుమ్మరి కుంట మలుపు వద్ద జనగాం జిల్లా కుందారం గ్రామానికి చెందిన ఎల్లల నరేష్ యువకుడు పల్సర్ బండి అతివేగంతో వచ్చి మహేష్ ఫ్యాషన్ ప్రో బండిని ఢీకొట్టడంతో

మహేష్ కు తలకు తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలో ఉన్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పగా మార్గమధ్యంలో మహేష్ మృతి చెందాడు.మృతుడికి ఇద్దరమ్మాయిలు,ఒక కుమారుడు.ఇట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button