
హాస్టల్‌లో కుప్పకూలి విద్యార్థిని హఠాత్మరణం
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్న బీసీ బాలికల వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న శ్రావణి హఠాత్తుగా మృతి చెందిన సంఘటన ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే బుధవారం ఉదయం 5 గంటల 45 నిమిషాలకు శ్రావణి హాస్టల్లో కింద పడిపోవడంతో తోటి విద్యార్థినులు హాస్టల్ సిబ్బందికి తెలిపారు.
దీంతో హుటాహుటిన అంబులెన్స్ ద్వారా విద్యార్థిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు విద్యార్థినిని పరీక్షించి ముందే మృతి చెందినట్లు నిర్ధారించారు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద రోదిస్తున్నారు. ఆసుపత్రి వద్ద విద్యార్థిని మృతి పట్ల ఆర్డీఓ రొడ్డ ప్రభాకర్, తహశీల్దార్ ప్రేమ్ కుమార్ విచారణ చేపడుతున్నారు.



