Khammam
Trending

ఉత్తమ తహసీల్దార్‌గా బాబ్జీ ప్రసాద్

ఉత్తమ తహసీల్దార్‌గా బాబ్జీ ప్రసాద్

ఉత్తమ తహసీల్దార్‌గా బాబ్జీ ప్రసాద్

ఖమ్మం జిల్లాలో ఉత్తమ ప్రతిభకు ప్రశంస పత్రం

సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.

ఖమ్మం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చింతకాని మండల తహసీల్దార్‌గా బాబ్జీ ప్రసాద్ ఎంపికయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా బాబ్జీ ప్రసాద్ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.తహసీల్దార్‌గా విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, ప్రజలకు అందించిన సేవలు, రెవెన్యూ పరిపాలనలో సమర్థవంతమైన పనితీరును గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.ఉత్తమ తహసీల్దార్‌గా ప్రశంస పత్రం అందుకోవడం పట్ల బాబ్జీ ప్రసాద్‌కు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button