
మీ సేవ కేంద్రాలపై ఏసీబీ దాడులు
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పలు మీసేవ కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయని కొంత కాలంగా ఏసీబీ ఆఫీసర్లకు వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ క్రమంలో బుధవారం రాత్రి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఎసీబీ ఆఫీసర్లు నగరంలోని పలు మీ సేవ సెంటర్లపై మెరుపు దాడులు నిర్వహించారు. కొందరు ఆఫీసర్లు, మీసేవ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు వివరాలు సేకరించినట్లు సమాచారం.
క్యాస్ట్, ఇన్కం, రెసిడెన్స్ సర్టిఫికెట్ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని, అర్హత లేని వారికి కూడా సర్టిఫికెట్లు జారీ చేశారని గుర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు పలు కీలక డాక్యుమెంట్లను, రికార్డులు, కంప్యూటర్ హార్డ్ డిస్కులను ఏసీబీ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.




