KarimnagarPoliticalTelangana

కరీంనగర్‌లో షాకింగ్ ఘటన.. అంత్యక్రియల్లో లేచి కూర్చొన్న యుద్ధుడు.. వీడియో వైరల్

కరీంనగర్‌లో షాకింగ్ ఘటన.. అంత్యక్రియల్లో లేచి కూర్చొన్న యుద్ధుడు.. వీడియో వైరల్

కరీంనగర్‌లో షాకింగ్ ఘటన.. అంత్యక్రియల్లో లేచి కూర్చొన్న యుద్ధుడు.. వీడియో వైరల్

Web desc : కరీంనగర్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. చనిపోయాడని భావించిన ఓ వృద్ధుడు అంత్యక్రియలకు తరలిస్తుండగా ఒక్కసారిగా లేచి కూర్చోవడం కరీంనగర్‌లో కలకలం రేపింది.

చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన శంకరయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు భావించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. మార్గమధ్యలో శంకరయ్య కదలికలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అంబులెన్స్‌లో ఉన్న శంకరయ్య ఒక్కసారిగా లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి.

కొద్దిసేపటి క్రితం చనిపోయాడని భావించిన వ్యక్తి కళ్లెదుట సజీవంగా కనిపించడంతో అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే శంకరయ్యను ఆస్పత్రిలో వైద్యులు ఏ పరిస్థితుల్లో మృతుడిగా నిర్ధారించారనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button